టీఆర్‌ఎస్‌ ఇక బీఆర్‌ఎస్‌.. ఏం సాధిస్తుందో?

Chakravarthi Kalyan
తెలంగాణ రాష్ట్ర సమితి ఇక భారత్ రాష్ట్ర సమితిగా మారింది. ఈ పేరు మార్పును ఆమోదిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నిన్న పార్టీ అధినేత సీఎం కెసిఆర్ గారికి అధికారికంగా లేఖ అందింది. ఈ నేపథ్యంలో  ఇవాళ మధ్యాహ్నం 1: 20 నిమిషాలకు దివ్య ముహూర్త సమయాన "భారత రాష్ట్ర సమితి" ఆవిర్భావం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ నిర్వహించారు.
తెలంగాణ భవన్లో సరిగ్గా ఒంటిగంట 20 నిమిషాలకు, తనకు అందిన అధికారిక లేఖకు రిప్లై గా సంతకం చేసి ఎన్నికల సంఘానికి అధికారికంగా పంపించారు. అనంతరం సీఎం కేసిఆర్ గారు బిఆర్ఎస్ జండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత పతావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.  తెలంగాణ భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హాజరయ్యారు. వీరితోపాటు.. జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డిసిసిబి అధ్యక్షులు డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు అందరూ కార్యక్రమానికి హాజరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs

సంబంధిత వార్తలు: