మోదీ.. షర్మిల సంగతి సరే.. మా సంగతేంటి?

Chakravarthi Kalyan
ఇటీవల తెలంగాణలో షర్మిల పాదయాత్రకు అడ్డంకులు ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. షర్మిల వాహనంపై దాడులు జరుగుతున్నాయి. ఆమె వాహనాన్ని తగలబెట్టారు కూడా. అయితే..ఈ విషయంపై ఏకంగా ప్రధాని మోదీ స్పందించారన్న వార్తలు రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వైయస్ షర్మిలపై పోలీసుల ప్రవర్తన బాధించిందని ప్రధాని మోదీ చెప్పినట్టు వార్తలు వచ్చాయి.

దీనిపై ఏపీ కాంగ్రెస్ మహిళా నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వైయస్ షర్మిలపై పోలీసుల ప్రవర్తన బాధించిందని చెబుతున్న ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ లో మహిళల పట్ల వైసీపీ అరాచకాలు కనిపించలేదా అని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు పద్మశ్రీ ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు మితిమీరిపోతున్నాయని పద్మశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతులు చేపట్టిన నిరసనలు సుమారు 700 మంది పైగా మరణిస్తే మోదీ మనసు చలించలేదని పద్మశ్రీ అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతుల ఆవేదన ప్రధానికి ఎందుకు కనిపించడం లేదంటూ పద్మశ్రీ ప్రశ్నించారు. అపార రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సైతం మోదీని ప్రసన్నం చేసుకోవాలని చూడడం సరికాదని పద్మశ్రీ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: