ఆంధ్రప్రదేశ్‌.. తుపాను తరుముకొస్తోంది?

Chakravarthi Kalyan
ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ప్రస్తుతమిది శ్రీలంకలోని ట్రింకోమలికి 400 కిలోమీటర్లు, చెన్నైకి 600 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ సాయంత్రానికి ఇది మరింత బలపడి తుపానుగా మారుతుందని ఐఎండీ స్పష్టం చేసింది. ప్రస్తుతం గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరం దిశగా తీవ్ర వాయుగుండం కదులుతోంది. రేపు ఉదయానికి ఉత్తర తమిళనాడు- కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా తుపాను వచ్చే అవకాశముంది. తదుపరి 24 గంటల పాటు కోస్తాంధ్ర- తమిళనాడు తీరాలవెంబడి తుపాను కొనసాగే అవకాశముంది.
ఉత్తర తమిళనాడు- దక్షిణ కోస్తాంధ్ర మధ్యే తుపాను తీరాన్ని కూడా దాటే సూచనలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇవాళ్టి నుంచి దక్షిణ కోస్తాంధ్ర- రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తమిళనాడు, కోస్తాంధ్ర తీరప్రాంతాలకు చెందిన మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: