తెలంగాణ ఆక్రమణకు మోదీ కుట్ర పన్నారా?

Chakravarthi Kalyan
మోదీ తెలంగాణ రాష్ట్రాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర పెట్టుబడులను గుజరాత్ తరలించుకుపోవాలని బీజేపీ కుట్ర చేస్తోందన్న రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో జరిగే దాడులు గుజరాత్ లో ఎందుకు జరగడంలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిలదీశారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేల కొనుగోలు చేసిన కేసీఆర్ ఇప్పుడు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారు. పక్క పార్టీలను పతనం చేస్తే అధికారం శాశ్వతం అనుకున్నారని అదే ఉసురు కేసీఆర్‌కు తగిలి ఆ పార్టీ పీలికలై పోతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శాపనార్థాలు పెడుతున్నారు. 80వేల మంది రైతులకు రైతు బీమా వచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి చెబుతున్నారని.. మరి అదే నిజమైతే అంతమంది రైతులను పొట్టన పెట్టుకున్న కేసీఆర్ సీఎంగా ఉండటానికి వీల్లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: