సీబీఐకి కవిత ఝలక్.. అసలు కారణం?

Chakravarthi Kalyan
దిల్లీ మద్యం కేసులో మంగళవారం విచారణకు హాజరు కాలేనని సీబీఐకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ముందుగా ఖరారైన కార్యక్రమాలు ఉన్నందున మంగళవారం కలవలేనని సీబీఐ దిల్లీ డీఐజీకి కవిత ఈమెయిల్ ద్వారా తెలిపారు. ఈనెల 11, 12, 14, 15 తేదీల్లో సీబీఐకి అనువైన రోజున హైదరాబాద్ లోని తన నివాసంలో అందుబాటులో ఉంటానని కవిత పేర్కొన్నారు. అయితే.. ఈనెల 6న హైదరాబాద్ నివాసంలో ఉంటానంటూ ఈనెల 2న సీబీఐకి కవిత ముందుగా తెలిపారు.
ఆ తర్వాత ఎఫ్ఐఆర్, కేంద్రం ఇచ్చిన ఫిర్యాదుక ప్రతులు పంపించాలని.. తర్వాతే విచారణ షెడ్యూలు ఖరారు చేయచ్చునని 3న సీబీఐ డీఎస్పీకి కవిత మెయిల్ పంపారు. అయితే.. ఎఫ్‌ఐఅర్, ఫిర్యాదు ప్రతులు వెబ్‌సైట్‌లో ఉన్నాయని సీబీఐ అధికారులు కవితకు జవాబిచ్చారు. ఎఫ్‌ఐఆర్, ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించానని... ఎక్కడా తన పేరు లేదని సీబీఐకి కవిత మళ్లీ మెయిల్ పెట్టారు. చట్టానికి కట్టుబడి ఉండే వ్యక్తిగా విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని కవిత తెలిపారు. ఈనెల 11, 12, 14, 15తేదీల్లో అందుబాటులో ఉంటానని కవిత పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: