నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్ ?

Chakravarthi Kalyan
తెలంగాణ సర్కారు జోరుగా నోటిఫికేషన్లు ఇస్తోంది. ఇటీవలే 9 వేల పైచిలుకు గ్రూప్ 4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడు  కేటీఆర్ మరో గుడ్‌ న్యూస్ చెప్పారు. ఇప్పటికే సుమారు 32వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు ఇతర శాఖల నుంచి నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపిన కేటీఆర్‌ త్వరలో గురుకుల విద్యాసంస్థల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

మొత్తంగా రెండు లక్షల 25వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను అతితక్కువ సమయంలో భర్తీ చేసి దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలవబోతుందని కేటీఆర్ స్పష్టంచేశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరించడంతో ఆఫీస్ సబార్డినేట్ నుండి ఆర్‌డివో వరకు అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే దక్కుతున్నాయని కేటీఆర్ తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడిన యువత ఆశలు, ఆకాంక్షలను నిజం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ సర్కార్ దేశంలో నవ శకానికి నాంది పలికిందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: