తెలంగాణలోని క్రైస్తవులకు గుడ్‌న్యూస్‌?

Chakravarthi Kalyan
తెలంగాణలోని క్రైస్తవులకు సర్కారు శుభవార్త చెబుతోంది. ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 21 లేదా 22 తేదీల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున క్రిస్మస్ వేడుకలు నిర్వహించనున్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామంటున్న ప్రభుత్వం.. క్రిస్టియన్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.

ఐటీ మంత్రి కేటీఆర్‌చే క్రిస్మస్‌కు ముందే ఉప్పల్ బాగాయత్‌ పరిధిలో 2 ఎకరాల స్థలంలో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయిస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. క్రిస్మస్ పర్వదిన పురస్కరించుకొని ఇప్పటికే జిల్లాల పరిధిలో క్రైస్తవ మహిళలకు పంపిణీ చేయనున్న దుస్తులను మంత్రి కొప్పుల ఈశ్వర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా క్రిస్మస్ శాంపిల్ కేకును మంత్రి కొప్పుల ఈశ్వర్  కట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: