చంద్రబాబు ఆ కులాలను బాగా వాడేసుకున్నారా?

Chakravarthi Kalyan
చంద్రబాబు బీసీలను సేవకులుగా వాడుకున్నారని వైసీపీ మంత్రి బొత్సా సత్య నారాయణ విమర్శించారు. తాము బీసీలు తలెత్తుకు తిరిగే విధంగా చర్యలు చేపట్టామని వైసీపీ మంత్రి బొత్సా సత్య నారాయణ తెలిపారు. లోకేష్ కు ఈ విషయంలో అవగాహన లేదన్న వైసీపీ మంత్రి బొత్సా సత్య నారాయణ.. ఉపాధ్యాయుల కోరిక మేరకే ఎన్నికల విధుల నుంచి తప్పించామని తెలిపారు. బోధనేతర పనులు తమపై వేయొద్దని వారే కోరారని వైసీపీ మంత్రి బొత్సా సత్య నారాయణ వివరించారు. లోకేష్ వి పనికిమాలిన మాటలన్న వైసీపీ మంత్రి బొత్సా సత్య నారాయణ... టిడిపి హయాంలో  బీసీలకు ఒక్క కార్పొరేషన్ పదవి ఇచ్చారా అని ప్రశ్నించారు. 5 ఏళ్లలో టిడిపి ప్రభుత్వం ఎన్ని కోట్లు పెట్టుబడులు తెచ్చారని  మంత్రి బొత్సా సత్య నారాయణ ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర కు టిడిపి హాయంలో ఏమి చేశారో చెప్పాలని  మంత్రి బొత్సా సత్య నారాయణ సవాల్ విసిరారు. 7 వ తేదీన జరిగే బీసీల మహాసభను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణుకు బొత్స సత్యనారాయణ పిలుపు ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: