మరో కొత్త జిల్లాకు.. చంద్రబాబు హామీ?

Chakravarthi Kalyan
చంద్రబాబు మరో ఎన్నికల హామీ ఇచ్చారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే పోలవరాన్ని ప్రత్యేక జిల్లా చేస్తామంటున్నారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తానని చంద్రబాబు హామీ ఇస్తున్నారు. నిన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు పోలవరం యాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కొవ్వూరు, పోలవరం నియోజకవర్గాల్లో పర్యటించిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు పట్టిన ఖర్మ పోవాలంటే జగన్‌ దిగిపోవాలన్నారు.

ఉద్యోగాలు రావాలంటే మళ్లీ తెలుగుదేశం రావాలని చంద్రబాబు అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన చంద్రబాబును  పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ రహదారికి అడ్డంగా బారికేడ్లు పెట్టారు. చంద్రబాబు ముందుకు వెళ్లకుండా అడ్డుకోవడంతో ఆయన పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనగా రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు... తాను ప్రారంభించి, సగానికి పైగా పనులు పూర్తిచేసిన ప్రాజెక్టు వద్దకు ఎందుకు వెళ్లనీయరని మండిపడ్డారు. అప్పుడే తెలుగుదేశం అధికారంలోకి రాగానే పోలవరాన్ని ప్రత్యేక జిల్లా చేస్తామని హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: