ఆ సీఎంలు అలా చేశారు.. జగన్ సంగతేంటి?
నీలం సంజీవ రెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి.. తమ ప్రభుత్వం పై కొన్ని ప్రతికూల వ్యాఖ్యలు చేశాయని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి నైతిక విలువలు కాపాడారని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి అన్నారు. అదే విధంగా సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపథ్యం లో ముఖ్యమంత్రి జగన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల విధుల నుండి ప్రభుత్వ ఉపాధ్యాయులను తప్పించడం లో ప్రభుత్వ దురుద్దేశం వుందన్న కాంగ్రెస్ నేత తులసి రెడ్డి. వచ్చే ఎన్నికల్లో ఉపాధ్యాయులు ఎన్నికల సిబ్బందిగా వుంటేనే ఎన్నికలు నిష్పాక్షికంగా జరుగుతాయన్నారు.