ఏపీలో భూముల సర్వే.. కేంద్రం పరిశీలన?

Chakravarthi Kalyan
ఏపీలో భూముల రీసర్వే జరుగుతున్న తీరుని కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం పరిశీలించింది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడిలో రీ సర్వే తీరుని కేంద్ర ప్రభుత్వ పంచాయతిరాజ్ సంయుక్త కార్యదర్శి అలోక్ ప్రేమ్ నాగర్ పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి వివరాలు సేకరిస్తున్నారు, ఏయే శాఖల సిబ్బందిని వినియోగిస్తున్నారని కేంద్ర ప్రభుత్వ పంచాయతిరాజ్ సంయుక్త కార్యదర్శి ఆరా తీశారు. రెవిన్యూ, సర్వేతో పాటు గ్రామ సచివాలయ సిబ్బంది పని చేస్తున్నట్లు అధికారులు ఆయనకు వివరించారు.

సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు కేంద్ర ప్రభుత్వ పంచాయతిరాజ్ సంయుక్త కార్యదర్శి  అడిగి తెలుసుకున్నారు. సచివాలయ సిబ్బంది కారణంగా మిగతా రాష్ట్రాల కంటే ఇక్కడ సర్వే పనులు త్వరగా, మెరుగ్గా చేసుకోవటానికి వీలు కలిగిందని అలోక్ ప్రేమ్ అభిప్రాయపడ్డారు.  గ్రామసభలతో మొదలై హక్కు పత్రాలు ఇచ్చే వరకూ రీసర్వే ప్రక్రియ సజావుగా సాగుతోందని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆయనకు తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా ఇంటికి సంబంధించిన పత్రాలు కూడా ఇవ్వబోతున్నట్లు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. వెబ్ ల్యాండ్ తరహాలో ప్రత్యేక పోర్టల్ ను దీని కోసం రూపొందిస్తున్నట్లు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: