జగన్ పాలనలో.. క్రైస్తవులపై దాడులా?

Chakravarthi Kalyan
ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి మైనారిటీ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును తీసుకురావాలని క్రైస్తవ నాయకులు కోరుతున్నారు. క్రిస్మస్ సందర్భంగా కరపత్రాలు పంచుతున్న క్రైస్తవులపై దాడి చేసి పవిత్ర గ్రంథమైన బైబిల్ ని తగలబెట్టిన దుండగులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ కుమార్ కోరారు.
విజయవాడలో పాస్టర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ముఖ్య మంత్రి జగన్ రెడ్డి రాష్ట్రంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని వారు కోరారు. దీని కోసం  మైనారిటీ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును తీసుకురావాలని కోరారు. మత స్వేచ్ఛను రాజ్యాంగమే కల్పించిందని వారు తెలిపారు. ఆ హక్కుకు విఘాతం కలిగించేలా రాష్ట్రంలో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. క్రైస్తవులపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ప్రభుత్వ కార్యదర్శి ఆరోగ్య సాల్మన్ కు వినతి పత్రం అందజేస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: