ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ.. కీలక నిర్ణయం..?

Chakravarthi Kalyan
ఎస్సీ హాస్టళ్లలో అక్రమంగా ఉంటున్న నాన్ బోర్డర్లను హాస్టళ్ల నుంచి తొలగించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ నిర్ణయించింది. గురుకులాల్లో విద్యార్థులకు కూడా ముఖ హాజరు విధానాన్ని ప్రవేశ పెట్టాలని కూడా ఆదేశించారు. కొన్నిపోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో నాన్ బోర్డర్లు తిష్టవేసారనే ఫిర్యాదులు వస్తున్నాయి. అక్రమంగా హాస్టళ్లలో ఉంటున్న నాన్ బోర్డర్ల కారణంగా విద్యార్థులతో పాటుగా హాస్టళ్ల సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. హాస్టళ్లలో విద్యార్థులు తప్ప బయటి వ్యక్తులు ఎవరూ ఉండటానికి వీల్లేదు.

నాన్ బోర్డర్లను హాస్టళ్ల నుంచి తొలగించడంలో భాగంగా ముందుగా విద్యార్థుల తల్లదండ్రులతో సమావేశాలు నిర్వహించాలి. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులందరికీ గుర్తింపు కార్డులను ఇవ్వాలి. హాస్టళ్లలో అనధికారికంగా ఉంటున్న వారందరినీ ఖాళీ చేయించాలి. అవసరమైతే ఈ విషయంలో పోలీసుల సహకారం తీసుకోవాలి. వాచ్ మెన్లు లేని హాస్టళ్లలో వాచ్ మెన్ లను నియమించడానికి చర్యలు చేపట్టాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: