చంద్రబాబు ఇదేం ఖర్మ.. ఇక్కడే ప్రారంభం?

Chakravarthi Kalyan
ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని మొదటగా ఈ నెల 30వ దెందులూరు నియోజకవర్గంలో ప్రారంభిస్తారు. ఈ మేరకు చంద్రబాబు 3రోజుల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ఖరారు అయ్యింది. ఈ నెల 30వ తేదీన ఉదయం కలపర్రు టోల్ గేట్ వద్ద నుంచి ప్రారంభo కానున్న చంద్రబాబుపర్యటన.... విజయరాయివద్ద ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమo నిర్వహిస్తారు.

అక్కడ నుంచి చంద్రబాబు దెందులూరు, చింతలపూడి నియోజకవర్గం సరిహద్దు గ్రామం రామచంద్రాపురంలో రైతులతో మాట్లాడతారు. సాయంత్రం చంద్రబాబు  చింతలపూడి చేరుకుని చింతలపూడి రోడ్ షోలో మాట్లాడి రాత్రి చింతలపూడిలో బస చేస్తారు. నవంబర్ 1వ తేదీన చంద్రబాబు  చింతలపూడిలో బయలుదేరి తాడువాయి బుట్టాయిగూడెం మీదుగా రోడ్ షో చేసుకుంటూ పోలవరం చేరుకుంటారు. పోలవరం నుంచి బయలుదేరి రాత్రికి కొవ్వూరు చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: