2024: చంద్రబాబుకే కాదు టీడీపీకీ లాస్ట్‌..?

Chakravarthi Kalyan
ఇవే నా చివరి ఎన్నికలు అంటూ ఇటీవల కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీన్ని వైసీపీ నేతలు బాగా వాడేసుకుంటున్నారు. చంద్రబాబుకే కాదు, టీడీపీకి కూడా 2024వే చివరి ఎన్నికలు అంటున్నారు మాజీ మంత్రి కొడాలి నాని. రాష్ట్ర ప్రజలను తెలుగుదేశం పార్టీ మోసం చేసిందన్న మాజీ మంత్రి కొడాలి నానియ.. తాను  ఎవరికీ భయపడేది లేదని, ఎంతమంది వచ్చినా గుడివాడను ప్రభావితం చేయలేరని అంటున్నారు.
అంతే కాదు.. గుడివాడలో నేరుగా చంద్రబాబు పోటీ చేసినా తాను రెడీ అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబును మించిన సైకో మరొకరు లేరన్న మాజీ మంత్రి కొడాలి నాని..  కర్నూలులో హైకోర్టు గురించి న్యాయవాదులు ప్రశ్నిస్తే గుడ్డలూడదీసి కొడతానని చంద్రబాబు  అన్న విషయాన్ని గుర్తు చేశారు. 2024 ఎన్నికల తరువాత ఇదేం ఖర్మరా అని బాబు, లోకేష్‌ అనుకుంటారని మాజీ మంత్రి కొడాలి నాని వెటకారం ఆడారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: