జగన్.. సొంత ప్రాంతంలోనూ ఫెయిలయ్యారా?

Chakravarthi Kalyan
అన్నమయ్య జలాశయానికి గండి పడి కొన్ని గ్రామాలు కొట్టుకుపోయి ఏడాది అవుతోంది. ఈ ప్రమాదంలో 33 మంది వరకూ చనిపోయారు. అయితే.. ఆ సమయంలో వారిని ఆదుకుంటానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. బాధిత గ్రామాల్లో పర్యటించారు. కానీ.. ఏడాది అయినా బాధితుల బాధలు తీరలేదని జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అంటున్నారు. ఆయన ఇటీవల ఆ ప్రాంతంలో పర్యటించారు. రైల్వే కోడూరు నియోజకవర్గం, రాజంపేట అన్నమయ్య డ్యాం వల్ల నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు.
వైసీపీ ప్రభుత్వం 98% హామీలు అమలుపరుస్తున్నామని అబద్ధాలు చెబుతున్నారని.. అన్నమయ్య డ్యాం వల్ల 300 కుటుంబాలకు పైగా నష్టపోతే  వారికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు నెలల్లోనే ఇల్లు కట్టి ఇస్తానన్న హామీ ఇప్పటికీ నెరవేర్చలేదని నాదెండ్ల అన్నారు. సొంత జిల్లాలోని ఇటువంటి పరిస్థితులు ఉంటే రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని నాదెండ్ల మనోహర్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: