చంద్రబాబూ... గోబ్యాక్.. లాయర్ల డిమాండ్‌?

Chakravarthi Kalyan
కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబుకు నిరసనల సెగ తగులుతోంది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వాలని న్యాయవాదుల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో  హైకోర్టు పై స్పష్టమైన హామీ ఇవ్వాలని న్యాయ వాదులు డిమాండ్‌ చేస్తున్నారు. హైకోర్టు విషయంలో హామీ ఇవ్వకుంటే  చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు.

టీడీపీ  హైకోర్టు విషయంలో రాజకీయం  చెయ్యకుండా చిత్తశుద్ధితో వ్యవహరంచాలని న్యాయవాదుల సంఘం నేతలు కోరుతున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం హైకోర్టు ను మార్చినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు ను కర్నూలు కు తరలించాలని న్యాయవాదుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈ విషయంపై టీడీపీని ఎప్పటికప్పుడు నిలదీస్తామని న్యాయవాదుల సంఘం నేతలు చెబుతున్నారు. మరి ఈ విషయంపై టీడీపీ అధినేత ఎలా స్పందిస్తారో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: