ఆ సమస్య వారం రోజుల్లో పరిష్కరిస్తాం.. వైసీపీ భరోసా?

Chakravarthi Kalyan
రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తిదారులు ఆందోళన చెందుతున్నారు. ఆక్వా ఉత్పత్తుల ధరలు దారుణంగా పతనం అవుతున్నాయి. అయితే.. ఈ సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించిందని.. కేంద్ర ప్రభుత్వంతో కూడా సమన్వయం చేస్తూ ఆక్వా ఎగుమతులకు మార్గం సుగమం చేసేలా చర్యలు చేపడుతోందని సర్కారు చెబుతోంది. వారం- పది రోజుల్లోనే ఈ సమస్యకు పరిష్కారం చూపే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని చీఫ్ విప్ ప్రసాదరాజు అంటున్నారు.
 ప్రభుత్వం ఇప్పటికే మద్దతు ధర కూడా ప్రకటించిందన్న చీఫ్ విప్ ప్రసాదరాజు.. కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మద్దతు ధర వచ్చేలా, రైతులకు నష్టం లేకుండా చేసేందుకే చర్యలు తీసుకుంటున్నామన్న చీఫ్ విప్ ప్రసాదరాజు..  తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చేలా నూతన టెక్నాలజీతో ఆక్వా రైతులకు ప్రభుత్వం శిక్షణ కూడా ఇస్తోందన్నారు.  విద్యుత్‌ సరఫరా విషయంలోనూ అధికంగా ట్రాన్స్‌ఫార్మర్లు పెట్టేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: