చైనా రహస్య చర్చలు లీక్.. జిన్‌పింగ్‌ ఆగ్రహం?

Chakravarthi Kalyan
కెనడా ప్రధానితో తాను జరిపిన చర్చల వివరాలు బహిర్గతం కావడంపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో జీ20 సదస్సులో పలు అంశాలపై ఏకాంతంగా చర్చించారు. అయితే ఈ భేటీకి  సంబంధించిన వివరాలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి.

ఇలా రావడంపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అసనహం వ్యక్తం చేశారు. అంతే కాదు.. ట్రూడో తీరు పట్ల జిన్‌పింగ్‌ తన అంసతృప్తిని బాహాటంగానే చెప్పేశారు. అసలు మనం చర్చించిన విషయాలు మీడియాలో రావడమేంటని కెనడా   ప్రధానిని నిలదీశారు.  ఇది చర్చలు జరిపే విధానం కాదని ఘాటుగా బదులిచ్చారు. అయితే చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు ట్రూడో కూడా గట్టిగానే బదులిచ్చారు. మేం ప్రతిదీ పారదర్శకంగా నిజాయితీగా చేస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుుడు ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: