విశాఖలో ఘనంగా విరాట్ హిందూ సమ్మేళనం?

Chakravarthi Kalyan
విశాఖలో తొలిసారిగా నిర్వహిస్తున్న విరాట్ హిందూ సమ్మేళనం ఘనంగా ప్రారంభమైంది. ఎంవిపి కాలనీలోని ఆళ్వార్ దాస్ మైదానంలో ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర జిల్లాల అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఈ సమ్మేళనంలో  దేశ నలుమూలల నుండి పీఠాధిపతులు హాజరయ్యారు. ఋషికేష్, అయోధ్య, వారణాసి, మధుర, నైమిశారణ్యం, చిత్రకూట్, ఛత్తీస్ ఘడ్,  ఒడిషా, తెలంగాణ సహా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల నుండి సుమారు 300 మంది పీఠాధిపతులు, సాధు సంతులు, నాగ సాధువులు, అఘోరాలు హాజరయ్యారు. ఎంతో భక్తి శ్రద్ధలతో గోపూజ, శివార్చనతో సమ్మేళనం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తి బృందాలు హనుమాన్ చాలీసా, విష్ణు సహస్ర నామం, లలితా సహస్ర నామం పఠించాయి. భక్తులు కోలాటం,  సాము గారడీ ప్రదర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: