ఆ జీవోతో ఆ కులాలకు ఇబ్బంది.. రద్దు చేయాల్సిందే?

Chakravarthi Kalyan
ఎస్సీల మనుగడకు ప్రశ్నార్థకంగా నిలిచిన.. 10,956 సర్క్యులర్ లోని రెండు పేరాలను తొలగించాలని ఎస్సీల సొసైటీ డిమాండ్ చేసింది. 1998 లో సాంఘిక సంక్షేమ శాఖ ఈ సర్క్యులర్ విడుదల చేసింది. ఈ 10,956 సర్క్యులర్ లోని రెండు పేరాలను తొలగించాలని ఎస్సీల సొసైటీ డిమాండ్ చేస్తోంది. ఈ జీవోను అడ్డుపెట్టుకొని దళిత క్రైస్తవులను బలవంతంగా బీసీలో చేరుస్తున్నారని సంఘం అధ్యక్షులు రమేష్ బాబు అంటున్నారు.

వైసీపీ ఎన్నికల సమయంలో ఈ జీవోను తొలగిస్తామని హామి ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని పట్టించుకోవడం లేదని  సంఘం అధ్యక్షులు రమేష్ బాబు  ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీవో వల్ల దాదాపు 80లక్షల మంది రాజ్యాంగం కల్పించిన హక్కును కోల్పోతున్నారని  సంఘం అధ్యక్షులు రమేష్ బాబు  చెప్పారు. దీనిపై వైకాపా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని  సంఘం అధ్యక్షులు రమేష్ బాబు  హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: