విశాఖలో మోదీ ప్రారంభించిన ప్రాజెక్టులు ఇవే?

Chakravarthi Kalyan
విశాఖ ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానం నుంచి ఇవాళ ప్రధాని మోదీ.. వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.  అవేంటంటే.. శ్రీకాకుళం - అంగుల్ నేచురల్ గ్యాస్ పైప్ లైన్, ఇది 745 కిమీ, దీని విలువ రూ. 2658 కోట్లు. అలాగే హెచ్ -130సిడి యొక్క రాయపూర్ - విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ లో 6-లేన్ల గ్రీన్ ఫీల్డ్ రహదారి. దీనికి రూ.3778 కోట్లు ఖర్చవుతుందని అంచనా.

విశాఖపట్నంలోని ఎన్ హెచ్ -516సి పైన కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలా నగర్ జంక్షన్ వరకు 6 లేన్ల రోడ్డు - విశాఖపట్నం పోర్ట్ కనెక్టివిటీ కోసం అదనంగా 4 లేన్ల డెడికేటెడ్ పోర్ట్ రోడ్డు ప్రాజెక్టు.. మరొకటి విశాఖపట్నం ఫిషింగ్ హార్టర్ ఆధునీకరణ అభివృద్ధి  ప్రాజెక్టు.. ఇంకొకటి విశాఖపట్నం రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి ప్రాజెక్టు. ఇవి కాకుండా కృష్ణా గోదావరి డీప్ వాటర్ బ్లాక్ లో ఒఎన్ జిసి-యు-ఫీల్డ్ ఆన్ షోర్ సదుపాయాల ప్రాజెక్టును జాతికి అంకితం ఇచ్చారు.  మరొకటి ఎన్ హెచ్-326ఎ యొక్క నరసన్నపేట నుండి పాతపట్నం వరకు పునరావాసం అభివృద్ధి ప్రాజెక్టు.. ఇంకొకటి  శ్రీకాకుళం - గజపతి కారిడార్లో పవెడ్ షోల్డర్తో 2 లేన్లకు విస్తరించే ప్రాజెక్టు. ఇలా మొత్తం 10742 కోట్లతో ప్రాజెక్టులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు ప్రధాని మోదీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: