వాళ్లకూ రిజర్వేషన్లు..రేవంత్ రెడ్డి డిమాండ్‌?

Chakravarthi Kalyan
ఇటీవల సుప్రీం కోర్టు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. అందుకే పోలీసు నియామక మండలి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షా ఫలితాల్లో ఈడ్ల్యూఎస్ కోటాను నిర్ణయించి తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లులను పరిగణలోకి తీసుకోకపోవడంతో సుమారు పదిహేను వేల మంది అభ్యర్థులు నష్టపోతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు రాసిన బహిరంగలేఖలో వివరించారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు సర్టిఫికేట్లతో ఫిజికల్‌ టెస్టు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళే చివరి రోజని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు.
సుప్రీంకోర్టు తాజా తీర్పుకు అనుగుణంగా  అభ్యర్థులకు న్యాయం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరారు. లేనట్లయితే నష్టపోతున్న అభ్యర్థులకు కాంగ్రెస్ అండగా ఉంటూ కార్యాచరణ తీసుకుంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: