ఇవాళ ఆ జిల్లాలకు జగన్.. విడదల రజనీ ఏర్పాట్ల సమీక్ష

Chakravarthi Kalyan
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇవాళ పల్నాడు, గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం జగన్ ముందుగా యడ్లపాడు మండలం వంకాయలపాడు వద్ద ఐటీసీ మిర్చి ప్రాసెసింగ్ యూనిట్ ను ప్రారంభిస్తారు. ఆ అనంతరం గుంటూరు ప్రభుత్వ వైద్యకళాశాలకు 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఫైలాన్ ను సీఎం జగన్ ఆవిష్కరిస్తారు. అనంతరం వెంకటేశ్వర విజ్ఞాన్ మందిరంలో నిర్వహించే మైనారిటీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా  సీఎం జగన్ హాజరవుతారు.
సీఎం జగన్  రాక సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాలలో చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లను వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజనీ సమీక్షించారు. ఆమెతోపాటు ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, షేక్ మొహ్మద్ ముస్తఫాలు, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య రంగాన్నిచంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని.. తమ ప్రభుత్వం వచ్చాక వైద్య ఆరోగ్య రంగాన్ని గణనీయంగా మెరుగుపర్చామని మంత్రి రజని చెప్పారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది తమ ప్రభుత్వమేనని మంత్రి రజని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: