అంబానీ.. మా పొట్టగొట్టొద్దంటున్న నాయి బ్రాహ్మణులు?

Chakravarthi Kalyan
అంబానీలు ఇప్పుడు దేశమంతా అన్ని రంగాల్లోనూ వ్యాపిస్తున్నారు. చివరకు కుల వృత్తల్లోనూ అడుగు పెడుతున్నారు. తాజాగా ముకేశ్ అంబానీ సెలూన్లు కూడా పెట్టబోతున్నామని ప్రకటించారు. దీనిపై నాయి బ్రాహ్మణులు మండిపడుతున్నారు. క్షౌరవృత్తిలోకి రిలయన్స్ ప్రవేశాన్ని ప్రభుత్వమే నిషేధించాలని డిమాండ్ చేస్తూ నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆ కులస్తులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.
రిలయన్స్ సెలూన్ పేరిట రిలయన్స్ కంపెనీ క్షౌరవృత్తిలోకి ప్రవేశించడాన్ని తీవ్రంగా బ్రతికే వ్యతిరేకిస్తున్నామని బీసీ సంఘాల నాయకులు అంటున్నారు. దేశంలో ఇప్పటికే వివిధ కుల వృత్తులపై కబ్జాలు చేస్తూ కుల వృత్తిదారుల కడుపు కొడుతున్నారని వారు మండిపడ్డారు. ఇప్పటికే మసాజ్ పార్లర్ ల పేరిట అనైతిక చర్యలకు పాల్పడుతూ.... తమ కొలువులు పోగొట్టేలా,   అవమానించేలా ప్రవర్తించడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రభుత్వమే రిలయన్స్ సెలూన్లను నిషేధించాలని వారు డిమాండ్ చేశారు. కానీ ఈ ప్రభుత్వాల వల్ల అది అవుతుందా..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: