జగనన్నా.. వాళ్లను కాస్త ఆదుకో అన్నా..?

Chakravarthi Kalyan
జగన్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని చెబుతోంది. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది. తక్కువ వడ్డీకే రుణాలిస్తున్నామంటోంది. కానీ.. ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకోవడంలేదని టీడీపీ ఆరోపిస్తోంది.  గిడ్డంగుల్లో ధాన్యం నిల్వలు కుప్పలు తెప్పలుగా ఉన్నా కొనే నాధుడు కరువయ్యాడని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ఆర్బీకే లో కమీషన్ ఏజెంట్లు ఉన్నారని..  చేయి తడిపితేనే పంట అమ్ముకోగలమని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అంటున్నారు.
ప్రభుత్వం రైతులకు మేలు చేసేలా ఉండాలి గానీ అన్యాయం చేసేలా ఉండకూడదని  టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ఆర్బీకే భవనాలు ఎక్కడా నిర్మాణం కాలేదని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. రైతులకు ఇవ్వాల్సిన పాత బకాయిలు వెంటనే చెల్లించాలని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి  డిమాండ్‌ చేశారు.  కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బియ్యాన్ని కూడా దొడ్డిదారిన తరలిస్తున్నారని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: