వాయు కాలుష్యం: దిల్లీవాసులకు కాస్త రిలాక్స్ ?

Chakravarthi Kalyan
దిల్లీలో వాయు కాలుష్యం ఎంతగా పెరిగిందో తెలుసు కదా. చివరకు ఈ వాయు కాలుష్యం వల్ల దీపావళి పండుగ చేసుకునే భాగ్యం కూడా దిల్లీ వాసులకు అధికారికంగా కలగలేదు. ప్రభుత్వం బాణా సంచా వేడుకలపై నిషేధం విధించింది. అంతే కాదు.. బాణాసంచా అమ్మినా.. కలిగి ఉన్న కూడా నేరంగానే ప్రకటించింది. అయితే.. ఇప్పుడు కాస్త సీన్ మారిందట.  అందుకే ఇప్పుడు దిల్లీలో గతంలో విధించిన ఆంక్షలను  కేజ్రీవాల్ ప్రభుత్వం సడలించింది.
వాయు నాణ్యత సూచీ మెరుగుపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దిల్లీ మంత్రి గోపాల్  రాయ్ వెల్లడించారు. మూసివేసిన ప్రైమరీ పాఠశాలలు బుధవారం నుంచి తెరుచుకుంటాయని మంత్రి గోపాల్  రాయ్ తెలిపారు. దిల్లీలోకి వచ్చే ట్రక్కులపై విధించిన నిషేధాన్ని కూడా ఎత్తివేస్తున్నట్లు మంత్రి గోపాల్  రాయ్ వివరించారు. వర్క్  ఫ్రం హోమ్  చేయాలని దిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు పెట్టిన నిబంధనను కూడా తొలగిస్తున్నట్లు  మంత్రి గోపాల్  రాయ్ పేర్కొన్నారు. రోడ్లు, ఫ్లై ఓవర్లు, బ్రిడ్జ్ లు, పైప్ లైన్, విద్యుత్  సరఫరాకు సంబంధించిన నిర్మాణ సంబంధ పనులపై విధించిన నిషేధాన్ని కూడా ఎత్తివేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: