ఏపీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలా?

Chakravarthi Kalyan
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని ఉపయోగించ వద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం చెబుతోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం యధేచ్చగా నిబంధనలు ఉల్లంఘిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమంలో కూడా వాలంటీర్లు చురుగ్గా పాల్గొంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.  కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయిమెంట్ సర్వే పేరుతో యాప్ తీసుకొచ్చి... ఇంట్లో ఎవరెవరు పట్టభద్రులు ఉన్నారు... వారు ఏ పార్టీకి ఓటు వేస్తారనే వివరాలను సేకరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
వైసీపీకి  వ్యతిరేకంగా ఉన్న పట్టభద్రుల ఓట్లను నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఇటీవల పులివెందుల మున్సిపల్ కమిషనర్... ఎమ్మెల్సీ ఎన్నికల్లో పనిచేయాలని సచివాలయ సిబ్బందికి ఆదేశాలు ఇస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని టీడీపీ నేతలు  గుర్తు చేశారు. రెండు రోజుల కిందటే కల్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ... గ్రామ సచివాలయ సిబ్బందితో సమావేశమై... జగన్ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందనే విధంగా మాట్లాడటం దేనికి సంకేతం అని టీడీపీ నేతలు  వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: