పవన్‌.. రెచ్చగొట్టొద్దు.. విడదల రజని వార్నింగ్‌?

Chakravarthi Kalyan
వైసీపీ మంత్రి విడదల రజని.. పవన్‌ కల్యాణ్‌కు వార్నింగ్ ఇచ్చారు. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో అభివృద్ధి కోసమే అధికారులు ఆక్రమణలు తొలగిస్తే పవన్ కళ్యాణ్ పనికట్టుకుని గ్రామానికి వెళ్లి అక్కడున్న వాళ్లను రెచ్చగొట్టడం అల్లర్లు సృష్టించడం తగదన్నారు. చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని మంత్రి విడదల రజని అన్నారు. ప్రజల సమస్య కోసమో.. మేలు చేసే అంశం మీదో రాజకీయం చేస్తే ఇబ్బంది లేదని.. కానీ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ సంక్షేమం కోసం.. చంద్రబాబు ప్రయోజనం కోసం పనిచేస్తున్నారని మంత్రి విడదల రజని విమర్శించారు.

పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయం చేయడం కోసమే ఇప్పటం గ్రామానికి వెళ్ళాడని మంత్రి విడదల రజని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోవడంతో చంద్రబాబుపై వారే రాళ్ల దాడి చేసుకుని మాట్లాడుతున్నారని మంత్రి విడదల రజని అన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న పనులను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి విడదల రజని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా 3255 సేవలు అందిస్తున్నట్లు మంత్రి విడదల రజని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: