జగన్‌ కళ్లలో ఆనందం కోసమే ఈ అరెస్టులా?

Chakravarthi Kalyan
విపక్ష నేతల అరెస్టులు ఏపీలో రాజకీయ వివాదాలకు కారణం అవుతున్నాయి. జగన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం తెదేపా నాయకులను అక్రమ అరెస్ట్ లు చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా అంటున్నారు. జగన్ రెడ్డి శుక్రవారం డైవర్షన్ రాజకీయం చేస్తున్నారని దేవినేని ఉమా విమర్శించారు. బాబాయికి గొడ్డలిపోటు నిజమేనన్న చెల్లి మాటలు డైవర్షన్ చేసేందుకే అయ్యన్న అరెస్ట్ అని దేవినేని ఉమా తెలిపారు.
శ్రీశైలం, నాగార్జున సాగర్ లో నీళ్ళున్నా దాళ్వా పంట ఎందుకు వద్దు అంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని  దేవినేని ఉమా డిమాండ్ చేశారు. సన్న బియ్యం సన్నాసి, మాజీ మంత్రి, తహసీల్దార్ కొడాలి నాని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని దేవినేని ఉమా హితవు పలికారు. నువ్వు మంత్రి గా సంపాదించిన డబ్బులు ఎవడో ఎత్తుకుపోయి నీ మెదడు దెబ్బతిందని దేవినేని ఉమా ఎద్దేవా చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: