హైదరాబాద్‌ను తలదన్నేలా విశాఖ రాజధాని?

Chakravarthi Kalyan
విశాఖపట్నంలో 10, 000 కోట్లు పెడితే హైదరాబాద్ తలదాన్నే రాజధాని నిర్మించవచ్చని  వైసీపీ నాయకులు అంటున్నారు. విశాఖపట్నం అభివృద్ధి చెందిన నగరం అని.. పెట్టుబడి  పెట్టడానికి పెట్టుబడిదారులు వస్తారని వారు చెబుతున్నారు. దేశంలో పెద్ద నగరాలలో విశాఖపట్నం 10వ స్థానంలో ఉందని మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి  తెలిపారు. విశాఖపట్నంలో 10,000 కోట్లు పెడితే హైదరాబాద్ తలదాన్నే  రాజధాని అవుతుందని ఆమె అన్నారు.

అదే అమరావతిలో పెడితే టిడిపి ప్రభుత్వం లెక్కల ప్రకారం  1,10,000 కోట్లు అవుతుందని.. అంత ఆర్థిక పరిస్థితి మన రాష్ట్రానికి ఉందా అని మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి  ప్రశ్నించారు. రాజధాని శ్రీకాకుళం ప్రకటిస్తే మద్దతు ఇస్తానన్న శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు.. ఏముందని  శ్రీకాకుళాన్ని రాజధానిగా ప్రకటిస్తామన్నారని మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి  ప్రశ్నించారు. 14 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు నాయుడు శ్రీకాకుళానికి ఒక్క ప్రాజెక్టు అయినా తీసుకొచ్చారని  మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి  ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: