భూ తగాదాల పరిష్కారానికి ఇక స్పందన ప్లస్?

Chakravarthi Kalyan
భూ సమస్యల పరిష్కారానికి స్పందన ప్లస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం చెబుతోంది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో కలెక్టర్ స్పందన ప్లస్ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా నిర్వహించి కొన్ని భూ సమస్యలను పరిష్కరించారు. దీర్ఘకాలికంగా ఉన్న భూ సమస్యలపై భేటీ నిర్వహించి ఆయా సమస్యలపై చర్చించారు. ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో భూతగాదాల పై ఫిర్యాదులు వస్తున్నాయి. వీటికి పరిష్కారం చూపేందుకు స్పందన ప్లస్ నిర్వహించాలని నిర్ణయించారు. పైలెట్ ప్రాజెక్టుగా నిర్వహించిన కార్యక్రమంలో తొమ్మిది సమస్యలపై ఆయా అధికారులతో చర్చించి ఐదింటిని పరిష్కరించారు.

భూత గదాల్లో చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన ఇతర ఏ విధమైన అక్రమాలు చోటు చేసుకున్న వాటిపై పోలీసులు చర్యలు తీసుకునేలా చూస్తున్నారు. మన పోలీస్ మన ఊరు కార్యక్రమం ద్వారా వారంలో మూడు రోజులు ఆయా మండలాల పరిధిలో ప్రజలతో సమావేశం అవుతారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాల వల్ల ఎదురయ్య ఇబ్బందులు వివరించి మంచి మార్గంలో యువత నడిచేలా చూస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: