బీఆర్‌ఎస్‌తో కేసీఆర్‌ ఫస్ట్ టార్గెట్‌ అదే?

Chakravarthi Kalyan
టీఆర్‌ఎస్‌.. బీఆర్‌ఎస్‌గా మారింది. దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరిస్తామని స్పష్టం చేసిన కేసీఆర్ తన ఫస్ట్ టార్గెట్‌గా మహారాష్ట్రను ఎంచుకున్నారు. మొదటి కార్యక్షేత్రంగా మహారాష్ట్రను ఎంచుకుంటామని ప్రకటించిన కేసీఆర్‌.. బీఆర్ఎస్‌ అనుబంధ రైతు సంఘటన మహారాష్ట్ర నుంచే ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ వల్ల దేశానికి మంచి జరిగితే అది చరిత్రలో స్థిర స్థాయిలో నిలిచిపోతుందని కేసీఆర్ అన్నారు.
అంతే కాదు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూనే దేశమంతటా పర్యటించనున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. కార్యక్షేత్రం వదలబోనన్న కేసీఆర్.. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానం అక్కరలేదన్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ముందుకు సాగుతామన్న కేసీఆర్‌.. తెలంగాణ ఉద్యమాన్ని విజయతీరాలకు తీసుకపోయినట్టుగానే, దేశాన్ని ముందుకు తీసుకపోవాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. దళిత, రైతు, గిరిజన ఉద్యమాలను  ప్రధాన అజెండాగా ముందుకు సాగుతామని.. దేశవ్యాప్తంగా వున్న అనేక సామాజిక రాజకీయ రుగ్మతలను తొలగిస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs

సంబంధిత వార్తలు: