నకిలీ గోల్డ్‌తో రూ. కోటి నొక్కేశారు.. ఎలా చీట్ చేశారంటే?
అంతే కాదు.. తనకు తెలిసిన వ్యక్తుల చేత నకిలీ బంగారం తాకట్టు పెట్టించి శేఖర ఆచారి మరో 21 లోన్లు తీసుకున్నాడు. నకిలీ బంగారంతో మొత్తం 30 లోన్లు తీసుకుని కోటిన్నర రూపాయల కాజేసినట్లు పోలీసుల విచారణ వెల్లడైంది. పోలీసులు బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి 8 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.