ఇక ఆ సర్టిఫికెట్‌ గ్రామ సచివాలయంలోనే పొందొచ్చు?

Chakravarthi Kalyan
పెళ్లి చేసుకుంటే.. దానికి ఆధారం వివాహ ధ్రువీకరణ పత్రం. దీన్ని ఇప్పటి వరకూ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఇస్తున్నారు. పెళ్లయ్యాక సర్టిఫికెట్ కావాలంటే అక్కడకు వెల్లాల్సిందే.. ఇవి మండల కేంద్రాల్లో ఉంటాయి. కానీ ఏపీలో ఇకపై దాని కోసం అంత ఇబ్బంది అవసరం లేదు. ఇకపై గ్రామ వార్డు సచివాలయాల్లోనే వివాహ దృవపత్రాలను జారీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఏపీ సీఎం జగన్ తెలిపారు. వైఎస్ ఆర్ కళ్యాణ మస్తు పథకం ద్వారా  ఎస్సీలకు  1లక్ష రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపిన సీఎం జగన్.. సర్టిఫికెట్ల విషయంలోనూ ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.
అలాగే లవ్ మేరేజ్‌ చేసుకుంటే లక్షా 20 వేల రూపాయలు... బీసీలకు 50వేలు.. బీసీల కులాంతర వివాహాలకు 75వేలు.. వైఎస్ ఆర్ షాదీ తోఫా పథకం కింద మైనార్టీలకు 1లక్ష ఇవ్వనున్నారు. విభిన్న ప్రతిభావంతులకు 1 లక్ష 50 వేలు.. భవన, ఇతర నిర్మాణ కార్మికులకు 40వేలు ఇవ్వాలని నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: