ఏపీలో ఈ సీన్‌.. నెవర్‌ బిఫోర్‌.. ఎవర్ ఆఫ్టర్‌?

Chakravarthi Kalyan
రాష్ట్రంలో వైయస్సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడితే ప్రతిపక్షాలు లేని పోని విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు.


రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలన్నారు. రాజాం- పాలకొండ ప్రధాన రహదారి పనులు కోసం 13 కోట్ల నిధులు మంజూరు చేశామని టెండర్లు కూడా ఖరారు అయ్యాయని త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. రాజాం -పాలకొండ రహదారి పనులను త్వరలో ప్రారంభిస్తామని బొత్స సత్యనారాయణ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: