చంద్రబాబు పక్కన బీసీలు.. జగన్ పక్కన రెడ్లు?

Chakravarthi Kalyan
టీడీపీ బీసీలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. వైసీపీకి బీసీలను దూరం చేసే ప్రయత్నాలు ప్రారంభించింది. అందుకు కొత్త వాదనను తెరపైకి తీసుకొస్తోంది. చంద్రబాబు పక్కన ఎప్పుడూ బీసీలు, ఎస్సీలే కన్పిస్తారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అంటున్నారు. కానీ.. జగన్‌కు రెండు పక్కల.. వెనుకా ముందూ రెడ్లే ఉంటారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు.
ఏపీ రాష్ట్రాన్ని జగన్ ఐదుగురు రెడ్లకు కట్టపెట్టారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. బీసీలపై పెత్తనం చేయమని జగన్‌ రెడ్లకు అధికారం కట్టబెట్టారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. బీసీలకు జగన్‌ కొత్తగా ఇవ్వాల్సిందేం లేదు.. ఆదరణ పరికరాలను ఇస్తే చాలని  అచ్చెన్నాయుడు  స్పష్టం చేసారు. చంద్రబాబు కొనుగోలు చేసి ఉన్న ఆదరణ పరికరాలను మూలన పడేశారని  అచ్చెన్నాయుడు  మండిపడ్డారు. పేరు మార్చటానికి హెల్త్‌ యూనివర్శిటీ జగన్‌ తాత కట్టిన యూనివర్శిటీ కాదని  అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. బీసీ సాధికారిత సమితి ఇచ్చిన సూచనలు.. సలహాలను మేనిఫెస్టోలో పెడతామని  అచ్చెన్నాయుడు  వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: