జగన్‌.. టైంపాస్‌ చేస్తున్నారా?

Chakravarthi Kalyan
అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో షిటిషన్ వేయడాన్ని రాజధాని రైతులు తప్పుబడుతున్నారు. ప్రభుత్వ చర్య కాలయాపనకే తప్ప ఉపయోగం లేదని వారు అభిప్రాయపడ్డారు. హైకోర్టు ధర్మాసనం అమరావతికి అనుకూలంగా స్పష్టమైన తీర్పు ఇచ్చిందని.. ఇప్పుడు జగన్ సుప్రీంకు వెళ్లినా, అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లినా తీర్పు మారదన్నారు. న్యాయం, ధర్మం తమ వైపే ఉంది కాబట్టి పైకోర్టులో విజయం సాధిస్తామని రైతులు విశ్వాసం వెలిబుచ్చారు.
రైతుల పాదయాత్ర సాగే మార్గంలో వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి మూడు రాజధానులు కావాలంటూ ఫ్లెక్సీలు కట్టారు. రైతులను రెచ్చగొట్టడం కోసమే వైసీపీ ప్రభుత్వ ఇలాంటి కుయుక్తులు పన్నుతోందని.. వాటిని శాంతియుతంగానే ఎదుర్కొంటామని చెబుతున్నారు. తీర్పు వచ్చిన 6 నెలల తర్వాత పిటిషన్ వేయటం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి ఎన్ని అవాంతరాలు ఎదురైనా తమ పోరాటం ఆపేది లేదని  స్పష్టంచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: