లేపాక్షి దోపిడీకి బ్రేకులు పడ్డాయంటున్న పయ్యావుల?

Chakravarthi Kalyan
లేపాక్షి భూములను తన బంధువులు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీకి అప్పనంగా కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా లేపాక్షి భూముల వేలం ప్రక్రియను పున: ప్రారంభించాలని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఆదేశించిందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అంటున్నారు. లేపాక్షి భూములను వేలంలో చౌకగా తీసుకోవాలని చూశారని..కానీ.. డబ్బు చెల్లించటంలో విఫలమయ్యారని కేశవ్ అంటున్నారు.

పదివేల కోట్ల రూపాయల విలువైన 8500 ఎకరాల భూమిని కేవలం 500 కోట్లకే తీసుకోటానికి ఏపీ ప్రభుత్వం ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారం అందించిందని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ప్రభుత్వ భూములకు ట్రస్టీగా ఉండి, ఆస్తులు కాపాడకుండా అయినవారికి కట్టబెట్టే ప్రయత్నానికి ఎన్ సీఎల్టీ బ్రేకులు వేసిందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌ అన్నారు. రవీంద్రనాథరెడ్డి కుమారుడు రామాంజులు రెడ్డి హరిత ఫర్టిలైజర్ సంస్థలో డీఫాల్టర్ గా ఉన్నారన్న టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌.. ఓ సంస్థలో డీఫాల్టర్ గా ఉన్న వ్యక్తి మరో దివాలా సంస్థను ఎలా కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: