జార్ఖండ్‌: అండర్‌వేర్‌ కొనేందుకు ఢిల్లీ వెళ్లాడట?

Chakravarthi Kalyan
జార్ఖండ్‌ లో రాజకీయాలు వేడెక్కాయి. అక్కడి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్ర ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. దొడ్డిదారిన  హేమంత్ సోరెన్  ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ సర్కారు ప్రయత్నిస్తోందని విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి  హేమంత్ సోరెన్ సోదరుడు బసంత్ సోరెన్  చేసిన కామెంట్లు కాంట్రావర్సీ అయ్యాయి.
బసంత్ సోరెన్ ఇటీవల ఢిల్లీ వెళ్లాడు.. అక్కడి నుంచి వచ్చాక.. విలేఖరులు ఢిల్లీ ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. దీనికి ఆయన తలతిక్క సమాధానం ఇచ్చారు. తన అండర్‌వేర్‌ పాడైందని.. కొత్త అండర్‌ వేర్ కొనుక్కునేందుకు ఢిల్లీ వెళ్లానని చెప్పుకొచ్చారు. దీంతో బసంత్  సోరెన్  కామెంట్లు ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి. బసంత్ వ్యాఖ్యలపై స్థానిక బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రజల బాధలు ఎమ్మెల్యేకు ఏమాత్రం పట్టడంలేదని విమర్శిస్తున్నారు. దీనికి తోడు బసంత్ సోరెన్  నియోజకవర్గంలో ఇటీవల ఓ అత్యాచారం, హత్య ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆయన ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడటంతో రాజకీయంగా దుమారం రేగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: