చైనాతో కయ్యం.. జపాన్‌తో ఇండియా సైనిక విన్యాసాలు?

Chakravarthi Kalyan
చైనాతో ఘర్షణ వాతావరం ఉన్న నేపథ్యంలో ఇండియా ఆచితూచి అడుగులు వేస్తోంది. రక్షణ పరంగా కీలకమైన దేశాలతో చేయి కలుపుతోంది. ఇండో-పసిఫిక్  ప్రాంతంలో ఇప్పటికే చైనా దూకుడుగా వ్యవహరిస్తోంది. భారత్ చుట్టూ ఉన్న దేశాలను బుట్టలో వేసుకుంటోంది. ఈ తరుణంలో భారత్‌, జపాన్‌తో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తోంది. భారత్, జపాన్ దేశాలకు చెందిన వాయుసేనల మధ్య సమన్వయం కోసం  సైనిక విన్యాసాలు నిర్వహించాలని రెండు దేశాలు తాజాగా నిర్ణయించాయి.

జపాన్ తో వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం ఇండియాకు చాలా అవసరం.. అందుకే ఉచిత, బహిరంగ, నిబంధనల ఆధారిత ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని నిర్ధారించడంలో భారత్,  జపాన్ కీలకపాత్ర పోషిస్తున్నాయి. భారత్ -జపాన్ ల మధ్య  మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఇటీవల  70ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా రక్షణ పరికరాలు, సాంకేతిక సహకారానికి సంబంంధించి భారత్ -జపాన్ మధ్య భాగస్వామ్యం విస్తరించాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్  ప్రకటించారు. భారత్ లోని రక్షణ కారిడార్ లో పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు. జపాన్  పరిశ్రమలను ఇండియాకు ఆయన ఆహ్వానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: