సరిహద్దుల్లో ఘర్షణ: భారత్, చైనా సంచలన నిర్ణయం?

Chakravarthi Kalyan
భారత్, చైనా మధ్య సరిహద్దు ఘర్షణలు కొత్త కాదు.. అటు లద్దాఖ్‌తో మొదలుకుని.. అటు అరుణాచల్ ప్రదేశ్ వరకూ అనేక ప్రాంతాల్లో ఇండియా, చైనా మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం లద్దాఖ్ సరిహద్దుల్లోని గాల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణ రెండు దేశాలను మరింత దూరం చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మళ్లీ ఆ స్థాయి ఘర్షణలు జరగకపోయినా.. రెండు దేశాల మధ్య విశ్వాసం మాత్రం సడలింది.

అయితే.. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య చర్చలు మాత్రం జరుగుతున్నాయి. అనేక విడతలు జరిగిన ఈ చర్చల కారణంగా.. ఇప్పుడు ఓ శుభవార్త వచ్చింది. చర్చల తర్వాత ఉమ్మడి ప్రకటన విడుదల చేసిన భారత్‌, చైనా సైన్యాలు.. వివాదాస్పదమైన గోగ్రా-హాట్‌ స్ప్రింగ్స్‌  ప్రాంతాల నుంచి ఇరుదేశాల బలగాలు వెనక్కి వెళ్లాలని నిర్ణయించినట్టు తెలిపాయి. ఈ మేరకు భారత్‌-చైనా కార్ప్‌ కమాండర్స్‌ భేటీలో నిర్ణయించినట్లు ప్రకటన విడుదల చేశాయి. ఇరు దేశాల బలగాలు, సైనిక సంపత్తిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్టు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. భారత్, చైనా మధ్య సరిహద్దు ఘర్షణలు కొత్త కాదు.. అటు లద్దాఖ్‌తో మొదలుకుని.. అటు అరుణాచల్ ప్రదేశ్ వరకూ అనేక ప్రాంతాల్లో ఇండియా, చైనా మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం లద్దాఖ్ సరిహద్దుల్లోని గాల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణ రెండు దేశాలను మరింత దూరం చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మళ్లీ ఆ స్థాయి ఘర్షణలు జరగకపోయినా.. రెండు దేశాల మధ్య విశ్వాసం మాత్రం సడలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: