జింబాబ్వేలో మాయ రోగం.. 700 మంది చిన్నారులు మృతి?

Chakravarthi Kalyan
కొత్తగా పుట్టుకొస్తున్న రోగాలతో పాటు పాత రోగాలు కూడా విజృంభిస్తున్నాయి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కాటు వేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆఫ్రికాలోని జింబాబ్వేలో అదే జరగుతోంది. అక్కడ మనం తట్టుగా పేర్కొనే మీజిల్స్‌ జబ్బు చిన్నారుల ప్రాణాలు తీస్తోంది. ఈ మధ్య కాలంలో జింబాబ్వేలో ఈ వ్యాధి బారినపడి ఏకంగా 698 మంది చిన్నారులు మృత్యువాతపడినట్లు జింబాబ్వే ఆరోగ్య శాఖ తెలిపింది.
దీంతో జింబాబ్వే దేశవ్యాప్తంగా మీజిల్స్ టీకాను తప్పనిసరి చేయాలని భావిస్తోంది. జింబాబ్వేలో భారీ స్థాయిలో నమోదవుతోన్న మీజిల్స్‌ కేసులు, మరణాలపై యూనిసెఫ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. జింబాబ్వేలో ఏప్రిల్‌ తొలివారంలో ఈ మీజిల్స్‌ వ్యాధిని కొందరిలోగుర్తించారు. ఆ తర్వాత కొన్ని వారాల్లోనే ఇది దేశవ్యాప్తమైంది. ఇప్పటివరకు జింబాబ్వేలో మొత్తం 6 వేలకు పైగా మీజిల్స్ కేసులు నమోదయ్యాయి. 700 మంది వరకూ మృత్యువాతపడినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది. సెప్టెంబర్‌ 1వ తేదీ ఒక్కరోజే 37 మంది చిన్నారులు చనిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: