బాబోయ్‌.. చైనాలో ఇంకా కరోనా అరాచకం తగ్గలేదుగా?

Chakravarthi Kalyan
చైనా కరోనా పుట్టినిల్లన్న సంగతి తెలిసిందే. అయితే ప్రపంచమంతటా కరోనా ప్రభావం తగ్గినా.. పుట్టినింటిపై కరోనాకు ఇంకా మమకారం పోనట్టుంది. అందుకే ఇంకా చైనాను కరోనా వేధిస్తూనే ఉంది. ఇంకా చైనాలో కొవిడ్ లాక్ డౌన్లు కొనసాగుతూనే ఉన్నాయి. చైనాలోని చెంగ్డూ నగరంలో కరోనా కేసులు పెరగడంతో ఇప్పుడు మళ్లీ లాక్ డౌన్ విధించారు. చెంగ్డూ నగరంలోని 2 కోట్ల 10 లక్షల మంది జనాభా ఉన్నారు. వారంతా ఇళ్లలోనే ఉండాలని తాజాగా చైనా అధికారులు ఆదేశించారు.

ఆ నగరంలో నిత్యావసర దుకాణాలు మినహా మిగిలిన షాపింగ్  మాళ్లు, దుకాణాలు మూతపడ్డాయి. ఎవరైనా చెంగ్డూ నగరం నుంచి బయటకు వెళ్లాలంటే తగిన కారణాలు చూపించాలి. రెస్టారెంట్లలో పార్సిల్ సర్వీసులను మాత్రమే అనుమతిస్తున్నారు. నిత్యావసరాలు కొనేందుకు కుటుంబంలో ఒకరిని మాత్రమే అనుమతి ఉంది. వారు కూడా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్‌ చూపించాల్సిందే. ప్రస్తుతం చెంగ్డూ నగరంలో వెయ్యి కేసులు నమోదయ్యాయి. ఎలాంటి మరణాలు నమోదు కాకపోయినా చైనా అధికారులు మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: