ఇక ప్రతి ప్రభుత్వ ఆఫీసులోనూ ఆ బోర్డు తప్పనిసరి?

Chakravarthi Kalyan
ప్రభుత్వ కార్యాలయం అంటేనే ప్రజలకు తలనొప్పి వస్తుంది. జనం గోడు పట్టించుకునే అధికారులు చాలా తక్కువ. అందులోనూ ఏ పని కావాలన్నా లంచాలు సమర్పించుకోవాల్సిందే. లంచం ఇవ్వకపోతే.. ఏవో కుంటిసాకులు చెప్పి ఆఫీసు చుట్టూ తిప్పుతూనే ఉంటారు. ఎందరు పాలకులు వచ్చినా ఈ సీన్ మాత్రం మారలేదు.
అయితే.. ఇప్పుడు సీఎం జగన్ మాత్రం ఈ సీన్ మారుస్తానంటున్నారు. లంచగొండి అధికారులపై ఉక్కుపాదం మోపుతానంటున్నారు. లంచం తీసుకునే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్న సీఎం జగన్..  ప్రతి ఆఫీసు ముందు పెద్ద అక్షరాల్లో ఏసీబీ టోల్‌ ఫ్రీ నంబర్‌ ప్రదర్శించాలని తాజాగా అధికారులను ఆదేశించారు. కేవలం లంచాల కోసమే కాదు.. మాదక ద్రవ్యాలు, గంజాయి వంటి సమాచారం కూడా ఈ నెంబర్‌కు చెప్పొచ్చు. అందుకే ప్రతి కాలేజీ, యూనివర్శిటీ ముందు 14400 నెంబర్ ను  ప్రదర్శించాలని సీఎం ఆదేశించారు. గ్రామ సచివాలయం నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకూ, పోలీస్‌స్టేషన్‌ నుంచి ఎస్పీకార్యాలయం వరకూ, పీడీఎస్‌ షాపుల వద్ద  ఈ బోర్డులు  కనిపించాలంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

acb

సంబంధిత వార్తలు: