మార్కులు తక్కువ వేశారని.. టీచర్లను కట్టేసి కొట్టారు?

Chakravarthi Kalyan
ఎక్కడైనా పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తే.. టీచర్లు పిల్లలను శిక్షిస్తారు. మరికొందరైతే.. బెత్తం విరిగే వరకూ కొడుతుంటారు. కానీ.. జార్ఖండ్‌లో సీన్ రివర్స్ అయ్యింది. తక్కువ మార్కులు వేశారంటూ ఉపాధ్యాయులను విద్యార్థులు చెట్టుకు కట్టేసి కొట్టారు. జార్ఖండ్ లోని దుమ్కాలోని గిరిజన ప్రభుత్వ పాఠశాలలో ఈ విచిత్రం జరిగింది.
9వ తరగతి ఫలితాల్లో పాఠశాలలో 11 మంది విద్యార్థులకు ఫెయిల్ అయ్యారట. అందుకు కారణం ఈ టీచర్లేనని భావించిన విద్యార్థులు ఉపాధ్యాయులతో పాటు క్లర్క్ ను కూడా చెట్టుకు కట్టేసి కొట్టారు. తమను ఎందుకు ఫెయిల్ చేశారంటూ.. విద్యార్థులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. టీచర్లు కావాలనే ప్రాక్టికల్  పరీక్షలో తక్కువ మార్కులు వేశారని విద్యార్థులు మండిపడుతున్నారు. వీడియో వైరల్ గా మారడంతో జిల్లా అధికారులు విచారణకు ఆదేశించారు. మొత్తానికి టీచర్లను కొట్టిన ఈ ఘటన సోషల్ మీడియాను ఊపేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: