"ఆచార్య' అందుకే అట్టర్‌ ఫ్లాప్.. ఆర్కే వింత లాజిక్‌?

Chakravarthi Kalyan
చిరంజీవి నటించి ఆచార్య సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ కలిసి నటించినా ఈ సినిమాను జనం ఆదరించలేదు. సినిమాను ఆసక్తిగా తీర్చిదిద్దడంలో కొరటాల శివ ఫెయిలయ్యారు. అయితే.. ఈ సినిమా పరాజయానికి ఇప్పుడు కొత్త కారణం చెబుతున్నారు ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ.

ఆయన చెబుతున్న కారణం ఏంటంటే.. ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డిపై కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉందట. ఈ కారణంగానే చిరంజీవి అంతటి వాడు జగన్‌ వద్ద చేతులు జోడించి వేడుకోవడాన్ని జనం ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారట. అందుకే ఆయన నటించిన ఆచార్య బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా దెబ్బతినిందట. వాస్తవానికి ఆ సినిమా మరీ అంత నాసిరకంగా లేకపోయినా.. కొత్తగా విడుదలైన సినిమాలపై ప్రజాభిప్రాయం ప్రతిబింబిస్తుంది కాబట్టి అలా జరిగిందట. ఈ వింత లాజిక్‌ చదివిన పాఠకులు ఔనా.. అంటూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: