32, 29 అంతస్తులు.. 8 నిమిషాల్లో కూల్చేస్తారు?

Chakravarthi Kalyan
దిల్లీ శివార్లలోని నోయిడాలోని సూప‌ర్‌ టెక్ ట్విన్ ట‌వ‌ర్ల కూల్చి వేతకు రంగం సిద్ధమవుతోంది.  ఆదివారం మ‌ధ్యాహ్నం ఈ జంట భవనాలను కూల్చివేయాలని నిర్ణయించారు. ఈ జంట భవనాల  కూల్చివేత‌తో 80వేల ట‌న్నుల ఘ‌న వ్యర్ధాలు పేరుకుపోతాయ‌ని నోయిడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో 50వేల ట‌న్నుల వ్యర్దాల‌ను అదే ప్రాంతంలో ఉంచుతారు. మిగిలిన 30వేల ట‌న్నుల‌ను డిమాలిష‌న్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌కు త‌ర‌లిస్తారు. అక్కడ ఆ వ్యర్థాలను శాస్త్రీయంగా ధ్వంసం చేస్తారు.

ఈ భవన వ్యర్ధాల్లో ఎక్కువ‌ భాగం భవన పునాదులను నింపేందుకు ఉప‌యోగిస్తారు. మొత్తం వ్యర్ధాల్లో నాలుగు వేల ట‌న్నులు ఇనుము ఉంటుందట. ఈ ఇనుప వ్యర్ధాల‌ను డిమాలిష‌న్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఎడిఫైస్ వేరు చేసి అమ్ముకుంటుందట. భవనాల కూల్చిన తర్వాత  అక్కడి నుంచి వ్యర్ధాల తొల‌గింపుకు మూడు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ట. ఈ జంట టవర్లలో ఒకదాని ఎత్తు 32 అంతస్తులు.. రెండోది 29 అంత‌స్తులు. ఈ  ట్విన్ ట‌వ‌ర్స్ కూల్చివేత‌కు 3, 700 కిలోల‌ పేలుడు ప‌దార్ధాల‌ను వాడతార‌ు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: