మాధవ్ న్యూడ్ వీడియోపై అంబటి షాకింగ్‌ కామెంట్స్?

Chakravarthi Kalyan
ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్ వీడియో ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మంత్రి అంబటి రాంబాబు ఈ వ్యవహారంపై స్పందించారు. అసభ్యకరమైన, మార్ఫింగ్‌ వీడియోను పట్టుకుని కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లు చంద్రబాబు రాజకీయం అంతా దాని చుట్టూ తిప్పుతున్నారని అంబటి మండిపడ్డారు. ఏపీ రాష్ట్రంలో ఇకేమీ సమస్యలు లేవా అని ప్రశ్నించిన అంబటి..  మాధవ్‌ను చూశారా.. ఎంత ఘోరం అని చంద్రబాబు మాట్లాడుతున్నాడని.. ఆయనకు బుద్ధి, జ్ఞానం ఉందా.. రాష్ట్రంలో ఇంకేమి సమస్యలు లేవా అని ప్రశ్నించారు.

రాష్ట్ర సమస్యలను వదిలేసి ఫేక్‌ వీడియో మీద మాట్లాడటమేంటని ప్రశ్నించిన అంబటి.. అసమర్థుడికి కోపం ఎక్కువని.. మార్ఫింగ్‌ చేసి ఏదోవిధంగా తప్పుడు ప్రచారం చేయాలని చంద్రబాబు ఆరాటపడుతున్నారని అన్నారు. ఇలాంటి నీచ ప్రయత్నాలు చంద్రబాబు చేయడం.. వాటిని ఎల్లో మీడియాలో ప్రసారం చేయడం.. ఆ మూడు చానల్స్‌లో ఇదే ప్రపంచం అన్నట్లుగా డిబేట్‌లు, చర్చలు పెట్టి మాట్లాడం దుర్మార్గమన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: