కేటీఆర్‌ ఫైర్‌: రేపిస్టులకు పూలదండలతో స్వాగతమా?

Chakravarthi Kalyan
2002లో గుజరాత్‌లో చోటుచేసుకున్న బిల్కిస్‌ బానో గ్యాంగ్‌ రేప్‌ ఉదంతం అప్పట్లో పెను సంచలనం కలిగింది. ఈ  కేసులో 11 మంది దోషులను యావజ్జీవ శిక్ష పడింది. అయితే వారందరూ 15 ఏళ్ల శిక్ష అనుభవించారు. అక్కడి ప్రభుత్వం వీరిని విడుదల చేయవచ్చని సిఫారసు చేసింది. తాజాగా వీరిని విడుదల చేశారు. వారిని  పూల దండలతో స్వాగతించడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

దీనిపై స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఇలాంటి ఖైదీల విడుదల, శిక్ష తగ్గింపు ఎప్పటికీ మరిచిపోలేమన్న ఆయన...  కర్మ సిద్ధాంతం ప్రకారం చేసింది తిరిగి అనుభవించాల్సిందేనన్నారు. ఒమిషన్‌, కమిషన్‌, రెమిషన్‌ లాంటి చర్యలను మరిచిపోలేమన్నారు. పార్టీలు ఎన్నికల్లో గెలిచేందుకు అభివృద్ధి, భద్రత, సంక్షేమంపై ఎన్నో హామీలు ఇచ్చేవని.. కానీ ఇప్పుడు రేపిస్టులు, గర్భిణిలు, చిన్నారులను హత్య చేసిన వారిని విడుదల చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: